చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఎ. అమల్‌రాజ్

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సీఎం విజ‌య్

Hellotelugu-AAmalraj

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్ప‌టికే ఇంటెలిజెన్స్ చీఫ్ ను అత్యంత నిబ‌ద్ద‌త క‌లిగిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా పేరు పొందిన ఆస్రా గార్గ్ ను నియ‌మించారు. దీంతో అవినీతి ప‌రుగుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. చాలా వంది త‌న పేరు వింటేనే వ‌ణుకుతారు. ఇదిలా ఉండ‌గా మ‌రో సిన్సియ‌ర్ పోలీస్ అధికారి ఎ. అమ‌ల్ రాజ్ కి చెన్నై న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దీంతో ప్ర‌జ‌ల ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త ఏమిట‌నేది చెప్ప‌క‌నే చెప్పారు సీఎం విజ‌య్. త‌ను 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, చెన్నై నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిన దినేష్ మోదక్ బదిలీపై క్రైమ్ బ్రాంచ్-క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధిపతిగా నియమితులయ్యారు.

ఇక ఎ. అమ‌ల్ రాజ్ గతంలో రెండు వేర్వేరు పర్యాయాలు తాంబరం పోలీస్ కమిషనర్‌గా సేవలు అందించారు. తమిళనాడు పోలీసు శాఖలో సేలం, కోయంబత్తూరు, తిరుచి నగరాల పోలీస్ కమిషనర్‌గా సహా వివిధ హోదాల్లో సేవలందించారు. రాష్ట్ర పోలీసు శాఖలోని మధ్య,పశ్చిమ జోన్లకు అధిపతిగా వ్యవహరించారు. పోలీస్ సూపరింటెండెంట్ హోదాలో తేని, మదురై, రామనాథపురం, సేలం జిల్లాల్లో పనిచేశారు. డాక్టర్ అమల్‌రాజ్ విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పతకం, మెరుగైన సేవలకు గాను పోలీస్ పతకం, ముఖ్యమంత్రి ప్రత్యేక పనితీరు పతకం , ప్రజా సేవలో అత్యుత్తమ ప్రతిభకు గాను ముఖ్యమంత్రి పతకాలను అందుకున్నారు.

Exit mobile version