Hydraa : హైదరాబాద్ – భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో మల్కం చెరువు మునిగి పోయింది. చెరువు పరిసరాల్లో వరద పోటెత్తడానికి గల కారణాలను హైడ్రా (Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. వరద ముంచెత్తడానికి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడానికి కారణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. చెరువుకు వచ్చే వరద పెద్దమొత్తంలో ఉండి.. బయటకు వెళ్లేది ఆ స్థాయిలో లేక పోవడంతో సమస్య తలెత్తిందని అదికారులు తెలిపారు. ప్రస్తుతం అలుగు పారడం ద్వారా మాత్రమే నీరు బయటకు వెళ్తోందని, స్లూయిజ్ గేట్లు కూడా ఏర్పాటు చేస్తే.. వర్షాకాలంలో నీటిమట్టాన్ని తగ్గించడానికి వీలవుతుందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పుడు వెంటనే ఈ పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. చెరువు పరిసరాల్లో రహదారులే కాకుండా.. నివాసాలు కూడా నీట మునుగుతున్నాయని.. వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. చెరువులోకి వచ్చిన ఇన్ లెట్ సామర్థ్యంతో పాటు.. ఔట్ లెట్ ను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
Hydraa Commission Key Update
మల్కం చెరువు చుట్టూ వరద నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. బయో డైవర్సిటీ పార్కు పరిసారలతో పాటు షేక్ పేట ప్రాంతాల నుంచి కూడా భారీ వరద వచ్చి వంతెన ఆరంభంలో నిలిచి పోతోందని.. ఈ వరదంతా మల్కం చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తదితరులు కమిషనర్ తో పాటు పాటు క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నారు.
Also Read : Union Cabinet Approved : రూ.30 వేల కోట్ల పరిహారానికి కేంద్రం ఓకే















