Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ‘గుంటూరు కారం’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు విశేషమైన స్పందన రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అతడు, ఖలేజా తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో… సినిమాతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ ప్లేస్ ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.
Guntur Kaaram – గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో ఈ నెల 9 (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో ఏర్పాటు చేయడంపై మహేశ్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు వేదికగా త్రివిక్రమ్ పేల్చబోయే పంచ్ ల కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కృష్ణా, గుంటూరు ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు మహేష్ బాబుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు వేదికగా నిర్వహించబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకు భారీగా అభిమానులు హాజరవుతారని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది.
Also Read : Vijay Rashmika : ఫిబ్రవరిలో విజయ్,రష్మికల నిశ్చితార్థమన్న మాట నిజమేనా..?