Pooja Visweswar: ‘కేజిఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సలార్(Salaar)’. డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా… కలెక్షన్ల విషయంలో వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించి పార్ట్ -2 షూటింగ్ ను ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ చిన్నపిల్లపై విలన్ బలత్కారం చేయబోతే హీరో ప్రభాస్ వచ్చి కాపాడిన ఫైట్ సీన్ బాగా హైలైట్ అయింది. ఈ సీన్ లో విలన్ ప్రక్కన కళ్ళద్దాలు పెట్టుకుని ఉండే ఆంటీ… ఫైట్ సీన్ కే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ ఆంటీ ఎవరో కాదు విశాఖపట్నంకు చెందిన పూజా విశ్వేశ్వర్.
Pooja Visweswar Met with Accident
‘సలార్’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న వైజాగ్ ఆంటీ పూజా విశ్వేశ్వర్… ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడింది. బైక్ పై అనకాపల్లి వెళ్తుండగా…. బైక్ స్కిడ్ అయి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పూజా ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా రక్తంతో నిండిపోయింది. ఈ క్రమంలోనే పూజాని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ… అక్కడ ఉన్న స్థానికులు ఆమెను సలార్ నటిగా గుర్తించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనితో పూజా విశ్వేశ్వర్ త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : Salaar Movie Updates : మరోసారి వేసవిలో విడుదల కానున్న ‘సలార్’