Kalki 2898 AD: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. దీనితో తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన నిర్వహించిన టెక్ ఫెస్ట్’23లో పాల్గొని కల్కి 2898 AD(Kalki 2898 AD)’ ప్రత్యేక కంటెంట్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఐటీ బాంబే విద్యార్ధులతో నిర్వహించిన Q &A సెషన్ లో ‘కల్కి 2898 AD’ సినిమాకి సంబధించిన పలు ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Kalki 2898 AD – ‘కల్కి’ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాం- దర్శకుడు నాగ్ అశ్విన్
వైజయంతి మూవీస్ పతాకంపై పాన్ వరల్డ్ సినిమాగా రూపొందిస్తున్న ‘కల్కి’ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతునాయో ప్రేక్షకులు చూస్తారు. ‘కల్కి’ కోసం దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.
మిగతా సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు భిన్నంగా కల్కి ?
మన దగ్గర కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చినప్పటికీ సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఎక్కువ రాలేదనే చెప్పాలి. కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. కల్కి సినిమా కోసం చాలా డిజైన్ వర్క్ చేశాం. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీం అంతా కలసి చాలా మేధోమధనం చేశారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతీది భారతీయ మూలాలతో ముడిపడి ఉంటాయి. అవి భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం ఉందనే అంశంతో ప్రతిది డిజైన్ చేశాం. తెరపై అవి చాలా అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం ఉంది.
Also Read : Kalki 2898 AD Update : ఫాన్స్ కి ఖుష్ కబురు చెప్పిన నాగ్ అశ్విన్