Kangana Ranaut: ఓటీటీలోకి కంగనా రనౌత్‌ ‘తేజస్‌’… స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

ఓటీటీలోకి కంగనా రనౌత్‌ ‘తేజస్‌’... స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

Hello Telugu - Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో సర్వేశ్‌ మేవారా తెరకెక్కించిన చిత్రం ‘తేజస్‌’. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను రోనీ స్క్రూవాలా నిర్మించారు. పాకిస్థాన్‌లో చేపట్టే ఓ రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే పైలట్‌గా కంగన నటించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 27న విడుదలైన బాక్సాఫీసు ముందు ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. దీనితో ఓటీటీ వేదికగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘జీ 5’ గుడ్ న్యూస్ చెప్పింది. 2024 జనవరి 5 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు ఉంచనున్నట్లు ప్రకటించింది. దీనితో జనవరి 5 కోసం ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Kangana Ranaut on OTT

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut). 2006లో బాలీవుడ్ హీరోయిన్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముంబై బ్యూటీ… తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాలతో స్టార్‌ హీరోలకు సైతం పోటీ ఇచ్చే రేంజ్‌కు చేరుకుంది. అయితే సినిమాలతో పాటు అంతేస్థాయిలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా.. ఈ ఏడాది తేజస్ మూవీతో అభిమానులను పలకరించింది. అక్టోబర్ 27న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రముఖి -2 తర్వాత నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

Also Read : RGV Complaint : ఆర్ జి వి తలపై 1 కోటి బహుమతి ప్రకటించినందుకు పిర్యాదు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com