AV Ranganath : హైదరాబాద్ – హైడ్రా నగరంలో దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, కాంప్లెక్సులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ హైదరాబాద్ లోని కింగ్స్ వే ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. శిథిలావస్థకు చేరడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సంబంధిత అధికారులను. కాగా సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులోని చారిత్రక నేపథ్యం ఉంది కింగ్స్‌వే ప్రభుత్వ పాఠశాలకు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని మీడియాలో వచ్చిన కథనాన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. అక్కడి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులతో మాట్లాడారు.
AV Ranganath Focus on
పైనుంచి పెచ్చులూడి ప్రమాదకరంగా ఉందని నిర్ధారణకు వచ్చారు కమిషనర్. ఈ పాఠశాల శిథిలావస్థకి చేరుకుందని .. ప్రమాదకరంగా భావించి 7 ఏళ్ల క్రితం నోటీసులు ఇచ్చామని జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ డీడీ నాయక్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పావణి ఏవీ రంగనాథ్ (AV Ranganath) తో చెప్పారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా.. పిల్లలకు ప్రత్యామ్నాయ తరగతులు చూపించాలని ఆ పాఠశాల హెచ్.ఎం., ఎంఈవో ప్రశన్నగా కోరారు. వెనువెంటనే పక్కనే ఉన్న మహబూబ్ స్కూల్ ట్రస్టుతో కమిషనర్ మాట్లాడారు. కొన్నాళ్లపాటు ఇక్కడ తరగతి గదులు కేటాయించాలని కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్‌కు ట్రస్టు ప్రతినిధులు చెప్పారు.
ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, విద్యాధికారి దృష్టికి కూడా తీసుకెళ్లి.. వెంటనే పాఠశాల నిర్మాణం జరిగేలా చూస్తామని.. హైడ్రా కమిషనర్ చెప్పారు. వచ్చే వారం సెలవులలో కూల్చివేతలు జరపేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Also Read : YS Jagan Fired on Police : పోలీసుల ఓవరాక్షన్ జగన్ సీరియస్

















