Vice President Election : ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice President Election) ఉంటుందని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగతుందని, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నెల 7న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 22న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. 25నన నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించామని స్పష్టం చేసింది ఈసీ.
Vice President Election Updates
ఇదిలా ఉండగా తన పదవీ కాలం ఇంకా ఉన్నా ముందస్తుగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖర్. తన వయసు మీరి పోయిందని, అనారోగ్యం కారణంగా సభా నిర్వహణకు సమయం కేటాయించ లేనంటూ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం మోదీ నిర్వాకం వల్లనే తను తప్పుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశాయి.
ఇది పక్కన పెడితే జగదీప్ రాజీనామా తర్వాత ఖాళీ అయింది ఉప రాష్ట్రపతి స్థానం. ఆయన స్థానంలో ఎవరిని నిలబెడతారనేది ఉత్కంఠగా మారింది. పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తమిళనాడు నుంచి తమిళ సై సౌందర రాజన్ , ఇటీవలే హర్యానా గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తెలంగాణకు చెందిన , అజాత శత్రువుగా పేరు పొందిన బండారు దత్తాత్రేయతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా జగ్దీప్ ధంఖర్ తన పదవీకాలం ముగియడానికి రెండు సంవత్సరాల కంటే కొంచెం ముందు జూలై 21న ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగారు. ఆయన పదవీకాలం ఆగస్టు 10, 2027న ముగియనుంది. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనపై ప్రభుత్వ వైఖరితో మిస్టర్ ధంఖర్ విభేదించడంతో ఈ మలుపు తిరిగింది.
Also Read : CM Chandrababu Alarming : త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం – సీఎం















