CM Chandrababu : వైఎస్సార్ కడప జిల్లా – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ఆయన సెక్యూరిటీని వదిలి ఎవరూ ఊహించని విధంగా ఆటోలో సభా ప్రాంగణానికి వచ్చారు. దీంతో అక్కడ ఉన్న వారంతా తనను చూసి విస్తు పోయారు. ఇది తన వర్కింగ్ స్టైల్ అంటూ చెప్పకనే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Key Update on Kadapa Steel Plant
అనంతరం సభా వేదికగా పెన్షన్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి చేపట్టారు . వితండవాదం చేయడంలో వైసీపీ ముందుంటుందని ఆరోపించారు. మహిళా MLAను దూషించిన వారిని జగన్ పరామర్శించడం దారుణమన్నారు. తన లాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. తోక జాడించే వారి తోకలు కత్తిరించడానికి తాను వెనుకాడ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). పేదలకు ఏడాదికి రూ.32,146 కోట్ల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏమైనా అని ప్రశ్నించారు.
ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం ఇచ్చామని అన్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో 7 సీట్లు గెలిపించారని, ఈసారి పదికి పది సీట్లు గెలిపిస్తారని అనిపిస్తోందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఆలోచనతోనే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించామన్నారు. రూ.3800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టమన్నారు.
Also Read : KTR Shocking Comments : యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జాతికి అంకితం
















