Srinivasan : ఢిల్లీ – తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు , పవర్ స్టార్ ఎస్. శ్రీనివాసన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. రూ. 5 కోట్ల రుణం మోసం కేసులో ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కింద అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2018 నుండి విచారణ నుండి తప్పించుకున్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా రెండుసార్లు ప్రకటిత నేరస్థుడుసగా వెల్లడించింది. దీంతో ఎస్. శ్రీనివాసన్ (Srinivasan) ను చెన్నైలో అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. సదరు నటుడు ఫైనాన్షియర్‌గా నటించాడు. ఆపై ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి రూ.1,000 కోట్ల రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ముందస్తుగా ఇప్పించేందుకు గాను రూ.5 కోట్ల మేర మోసం చేశాడని ఆరోపించారు.
Popular Actor Srinivasan Arrest
ఆ డబ్బును తరువాత సినిమా నిర్మాణం, వ్యక్తిగత అవసరాల కోసం మళ్లించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడిగా ఉన్న ఎస్. శ్రీనివాసన్ చాలా సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని తెలిపారు ఢిల్లీ పోలీసులు. చివరికి జూలై 27న చెన్నైలోని వనగరం పట్టణంలో పట్టుబడ్డాడని వెల్లడించారు. తక్షణమే కోర్టులో హాజరు పర్చామని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు స్పష్టం చేశారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికుమార్.
2010లో హెన్రీ లాల్రెమ్సంగా, దీపక్ బంగా, అనిల్ వర్ష్నే, రామానుజ మువ్వల వంటి వ్యక్తుల బృందం ఒక ప్రైవేట్ సంస్థను మోసం చేసిందని ఆరోపించారు.హోటల్ , కార్పొరేట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అధిక-విలువైన నిధులను పొందగల నిపుణులైన కన్సల్టెంట్లమని పేర్కొన్నారన్నారు. వీరు చాలా తెలివిగా స్కెచ్ వేశారని, ఫిర్యాదుదారుడికి శ్రీనివాసన్ ను ట్రేడింగ్ కంపెనీ ఓనర్ గా పరిచయం చేశారన్నారు. వెయ్యి కోట్లు రుణంగా రావాలంటే ముందుగా రూ. 5 కోట్లు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నరాని, ఆ తర్వాత రుణం రాక పోవడంతో మోసం జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారని అన్నారు. తను ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కు బౌన్స్ అయ్యిందన్నారు.
Also Read : Popular Actress Kushboo : హైకమాండ్ కు థ్యాంక్స్ పార్టీ బలోపేతంపై ఫోకస్



















