Tea : చాలా మందికి రోజు ప్రారంభం టీతోనే అవుతుంది. కొందరికి ఉదయం మాత్రమే కాదు, కార్యాలయాల్లో పనిచేసేవారికి మధ్యాహ్నం లేదా సాయంత్రం టీ (Tea) తాగడం అలవాటుగా మారిపోయింది. కానీ, టీ తాగే సమయంలో కొన్ని ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగిన వెంటనే తీసుకోకూడని కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tea – టీ తాగిన వెంటనే సిట్రస్ ఫలాలు వద్దు
నారింజ, ముసంబి, లైమ్ వంటి సిట్రస్ ఫలాలు టీ తాగిన వెంటనే తీసుకోవడం వల్ల శరీరానికి హానికరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇవి పేగులలో ఆమ్లత (అసిడిటీ), అజీర్తి, వాయువు వంటి సమస్యలను పెంచే ప్రమాదం ఉంటుంది. అందుకే టీ తాగిన తరువాత కనీసం అరగంట గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు.
పసుపు + టీ = కాదు
పసుపు ఆరోగ్యానికి మంచిదే అయినా, దాన్ని టీతో కలిపి తినడం మంచిది కాదు. ఇది శరీరంలో ఐరన్ శోషణను తగ్గించడానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంగా రక్తహీనత, అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
టీతో పాటు మిఠాయి తినకండి
చాలామందికి టీతో పాటు బిస్కెట్లు, స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. అయితే టీలో కెఫైన్ ఎక్కువగా ఉండటంతో, టీ తాగిన వెంటనే స్వీట్స్ తినడం రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుంది. దీర్ఘకాలంలో ఇది మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పాల పదార్థాలకు టీతో బంధం లేదు
పెరుగు, జున్ను, లేదా ఇతర పాల ఉత్పత్తులను టీ తాగిన వెంటనే తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణుల సూచన. ఇవి జీర్ణక్రియను అడ్డుకుంటాయి, కొన్ని సందర్భాల్లో అజీర్తి, వాంతులు వంటి లక్షణాలను తేవచ్చు.
Also Read : Chikungunya Effective Symptoms : మీ బాడీలో ఈ లక్షణాలు ఉంటే తస్మాత్ జాగ్రత్త



















