Gold : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తారస్థాయికి చేరుతున్నాయి. జూలై 29 ఉదయం వరకూ కొంతవరకూ స్థిరంగా ఉన్న ధరలు, మధ్యాహ్నానికి భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Gold – తులం ధర లక్ష దాటి పోయింది
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం (Gold) ధర 10 గ్రాములకు రూ. 1,00,480 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,210 కు చేరింది. అంటే ఒక్కరోజులోనే సుమారు 660 రూపాయల వరకు పెరుగుదల నమోదైంది.
వెండి ధరలు కూడా తగ్గేలా లేవు
బంగారం సరసన వెండి ధరలు కూడా ఎగబాకుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1,17,000 వద్ద కొనసాగుతోంది. చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో ఈ ధర రూ. 1,27,000 వద్దకు చేరింది.
పండుగ సీజన్‌కు ముందు ధరలు ఇంకా పెరిగే అవకాశాలు
వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తులం ధర లక్ష దాటి పోవడంతో, సాధారణ వినియోగదారులకు బంగారం దాదాపుగా అందని వస్తువుగా మారిపోయింది.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం, ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు మళ్లీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బంగారం మరోసారి సురక్షిత పెట్టుబడి సాధనంగా మారుతోంది. రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం దిగుమతులపై ప్రభావం చూపుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలంటే పునరాలోచన అవసరం. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు కొనుగోళ్లు ప్లాన్ చేసుకోవాలన్న సూచన నిపుణుల నుంచే వస్తోంది. ధరల పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనలోకి నెట్టివేస్తున్నది.
Also Read : Today Gold Price : వరుసగా మూడవరోజు తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు


















