Vedma Bojju : వరంగల్ జిల్లా – అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన కామెంట్స్ చేశారు. స్వంత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జీవో 49 మళ్లీ తెస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్తే, వాళ్లు చేసే తిరుగుబాటుకు తానే నాయకత్వం వహిస్తానంటూ అన్నారు.
Vedma Bojju Sensational Comments
అడవిలోకి వెళ్తున్న గొర్రెలు, బర్రెల కాపర్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (Vedma Bojju). కవ్వాల్ టైగర్ జోన్ లో రాకపోకలపై ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. అటవీశాఖ అధికారులు పద్ధతి మార్చుకోవాలని లేకపోతే వారికి నా తడాఖా ఏంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో ఈ జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు.
కానీ జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాయిస్ వినిపించడం విస్తు పోయేలా చేసింది. మిగతా ఎమ్మెల్యేలను, మంత్రి సీతక్కను విస్తు పోయేలా చేసింది. మొత్తం మీద ఈ జీవో పార్టీలో కలకలం రేపుతోంది. తనను గెలిపించిన వారంతా ఆదివాసీ బిడ్డలేనని, వారికి అన్యాయం జరుగుతుంటే తాను ఎలా చూస్తూ ఊరుకుంటానని ప్రశ్నించారు.
వాళ్ల జీవనాధారం అడవేనని, అలాంటి ఆధారాన్ని లేకుండా చేస్తామంటే తానే కాదు ఎవరూ కూడా ఒప్పుకోరంటూ స్పష్టం చేశారు వెడ్మ బొజ్జు.
Also Read : KTR Shocking Comments : బీజేపీ ఎంపీకి వందల కోట్ల కాంట్రాక్టు – కేటీఆర్


















