AI : అమెరికా – ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేరకు సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులను భయాందోళనకు గురి చేసేలా కామెంట్స్ చేశారు. ఇప్పటికే 15 వేల మందిపై వేటు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయా ఉద్యోగులకు సంస్థాగత పరంగా లేఖలు పంపించారు. కంపెనీ విజయవంతంగా ఉన్నా వచ్చే 15,000 పైగా ఉద్యోగ కోతలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా ఇది తనపై కూడా ఒత్తిడి అధికంగా ఉందన్నారు. ఈ నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో వేటు వేయక తప్పదన్నారు సత్య నాదెళ్ల.
AI Effect Huge Layoffs in USA
మైక్రోసాఫ్ట్ భారీ లాభాలతో కొనసాగుతోంది. సదరు సంస్థ 3.8 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. అయినా ఉద్యోగులను తొలగించాలని అనుకోవడం పట్ల జాబర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 చివరి పొజిషన్లో 2, 28,000 మంది ఉద్యోగులలో 2025లో 15,000 మందిని తొలగించారు. సత్తా ఉన్న ఉద్యోగుల సంఖ్య పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వస్తోందని సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం $80 బిలియన్ వరకు ఏఐ (AI) వసతులపై ఖర్చు చేసింది. ఈ భారీ ఖర్చుల వల్ల ఆర్థిక భారం పెరిగింది, అందుకే మేనేజ్‌మెంట్ ఉద్యోగాలను తగ్గించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది.ఇది ఉద్యోగాల కోతలకు కారణమయ్యింది.
ఏఐ టూల్ తో కొంత వరకు కోడ్ ను రాయడం మరింత సులువుగా మారుతోందని , దీని కారణంగా
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, అనలిస్ట్‌లు, హెచ్ ఆర్ పనులు వంటి ప్రారంభ స్థాయి కార్యాలయ ఉద్యోగాలు ఆటోమేషన్ చేసేవారిపై ప్రభావితం చూపుతున్నాయని చెప్పారు సత్య నాదెళ్ల. ఓ ఉద్యోగి 25 సంవత్సరాలుగా నిష్టతో పనిచేసినా, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిన నిర్ణయం ఒక ఆల్గోరిథమ్ ఆధారంగా తీసుకున్నారంటూ జాబ్స్ కోల్పోయిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : HYDRAA Strong Focus : ముష్కిన్ చెరువు కాపాడేందుకు హైడ్రా ఫోకస్



















