Gita Gopinath : అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థలో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న భారతీయ మూలాలు ఉన్న ఆర్థిక నిపుణురాలు గీతా గోపీనాథ్ (Gita Gopinath) తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకురాలిగా చేరుతున్నట్టు ప్రకటించారు.
Gita Gopinath – హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్త బాధ్యతలు
గీతా గోపీనాథ్ సెప్టెంబర్ 1 నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రారంభ గ్రెగొరీ, అనియా కాఫీ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా తన విధులను చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
“విద్యా మూలాలకు తిరిగొస్తున్న సమయం”
“IMFలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన తరువాత, ఇప్పుడు నా విద్యారంగ జీవితానికి తిరిగి రావాలనే నిర్ణయం తీసుకున్నాను” అంటూ గీతా పేర్కొన్నారు. “భవిష్యత్ ఆర్థిక నిపుణులకు శిక్షణ ఇచ్చే క్రమంలో, అంతర్జాతీయ ఆర్థిక రంగానికి సంబంధించిన పరిశోధనను కొనసాగించాలన్నది నా ఆశయంగా ఉంది” అని ఆమె అన్నారు.
గీతా గోపీనాథ్ ప్రస్థానం
- 2019 జనవరిలో IMF చీఫ్ ఎకనామిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో తొలిసారి ఓ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
- 2022 జనవరిలో ఆమెకు IMFలో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి దక్కింది.
- IMFలో చేరక ముందు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2005 నుంచి 2022 వరకు జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
- ఆమె 2001 నుంచి 2005 వరకు చికాగో యూనివర్సిటీలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొనసాగారు.
గోపీనాథ్ తిరిగి అకడెమిక్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, విద్య, పరిశోధన రంగాల్లో ఆమె చేసే కృషికి ప్రపంచ ఆర్థిక రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Also Read : Gold Silver Price Today : ఈరోజు పసిడి మరియు వెండి రేట్లు ఇలా!



















