PM Modi : ఢిల్లీ – కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను లేపేశామన్నారు ప్రధాని మోదీ. మేడిన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామన్నారు. వాడిన ఆయుధాలు వాటి సత్తా నిరూపించుకున్నాయని అన్నారు మావోయిస్టు ముక్త్ భారత్లో ముందడుగు వేశామన్నారు. దేశంలో మావోయిజం దాదాపుగా అంతమైందన్నారు.. అనేక ప్రాంతాలను మావోయిస్టుల నీడ నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లుగా మారిపోయాయని తెలిపారు.
PM Modi Key Comments on Maoism
సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో దేశన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం, దాచు కోవడంపైనే ఫోకస్ పెట్టిందని ఆరోపించారు నరేంద్ర దామోదర దాస్ మోదీ (PM Modi). కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందో అక్రమార్కులకు చోటు లేకుండా చేశామన్నారు. ఎవరైనా సరే కరప్షన్ అంటే భయపడే స్థితకి తీసుకు వచ్చామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
రెడ్ జోన్లు ప్రస్తుతం గ్రీన్ జోన్లుగా మారి పోయాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అలుపెరుగని రీతిలో పోరాటం చేస్తోందని అన్నారు. తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. పాకిస్తాన్ పై దాడుల తర్వాత భారత్ సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. ఎక్కడ దాక్కున్నా ఉగ్రవాదులను విడిచి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయని అన్నారు పీఎం. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. యాక్సియం-4 మిషన్పై మోడీ ప్రశంసలు కురిపించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామన్నారు.
Also Read : PM Kisan Interesting Update : ఎట్టకేలకు జూలై 25న రైతుల ఖాతాల్లో జామకానున్న పీఎం కిసాన్ నిధులు
















