Minister Anam : అమరావతి – మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు ఆలయాల అభివృద్దిపై. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ప్రతి భక్తునిలో ఆశాభావాన్ని నింపుతోంది. గత వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు, హుండీల ధ్వంసం, దేవాలయాలకు పార్టీ రంగులు వేయడం, రథాలు తగల బడటం వంటి సంఘటనలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆలయాల దర్శనం కోసం వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురయ్యారు.
Minister Anam Ramanarayana Reddy Comments
ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam) మరింత దృష్టి పెట్టారు . ప్రభుత్వమే దేవాలయాల పరిరక్షణను బాధ్యతగా తీసుకుంది.. వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన ఆలయాలను కూటమి సర్కార్ చర్యలు చేపట్టి ప్రక్షాళన మొదలు పెట్టింది. భక్తుల మనోభావాలకు తోడుగా – ధూప దీప నైవేద్య పథకంకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 321 ఆలయాలకు నిధులు మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 70 నియోజకవర్గాల్లో ఈ పథకం విస్తరించేలా చూశారు.
గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురై, నైవేద్యాలకు కూడా నోచుకోలేని ఎన్నో ఆలయాలు మళ్లీ ఇప్పుడు మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి చొరవతో పునరుజ్జీవనం పొందుతున్నాయి. కేవలం భక్తుల అవసరాలకు మాత్రమే కాకుండా, ఆలయాల వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర బిందువుగా కామన్ గుడ్ ఫండ్ (CGF) ఉపయోగ పడుతోంది. ఇప్పటివరకు రూ. 106.62 కోట్లు విలువైన 133 CGF పనులు మంజూరు చేశారు. ఆలయాలు మాత్రమే కాదు, వాటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఉపయోగపడుతోంది.
Also Read : MLA KTR Warning : ఇండియాకి హిందీ భాష అవసరం లేదు

















