YS Jagan : అమరావతి – నటించడంలో ఎన్టీఆర్ ను మించి పోయాడంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఏపీనా లేక బీహార్ అన్న అనుమానం కలుగుతోందన్నారు. అక్రమాలకు, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.
YS Jagan Slams CM Chandrababu
శాంతిభద్రతల యంత్రాంగం పూర్తిగా కుప్ప కూలిపోయిందని ఆరోపిస్తూ, కొత్త పాలనలో ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి. తన ప్రజా సందర్శనల సమయంలో తన సొంత భద్రతను ఉద్దేశ పూర్వకంగా తగ్గించారని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పౌరులను రక్షించాల్సిన వీళ్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్ రెడ్డి.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని తన సొంత ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని, సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడే ప్రయత్నం చేశారని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హారికను అందరూ చూస్తూ ఉండగానే మహిళ అని చూడకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. తన పర్యటన సందర్భంగా సినిమా డైలాగ్‌లతో కూడిన పోస్టర్‌లను ప్రదర్శించిన యువకులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తన వ్యక్తిగత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద ఏపీ ప్రజలపై, సమస్యలపై లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ ముఖ్యమంత్రి.
Also Read : Telangana – AP CM’s Important Meet : నీటి వాటాలపై రేవంత్, చంద్రబాబు చర్చ
















