Singapore : అమెరికా – ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో టాప్ లో నిలిచింది సింగపూర్ సిటీ. లగ్జరీ ఖర్చులకు కేరాఫ్ గా మారింది. లండన్ హాంకాంగ్ ను అధిగమించింది. రెండవ స్థానంలో నిలిచింది. వరుసగా సింగపూర్ (Singapore) మూడో ఏడాది కూడా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం విశేషం. జూలియస్ బేర్ అనే సంస్థ ప్రతి ఏడాది సెర్చ్ చేస్తుంది. కేటగిరీల వారీగా ఆయా నగరాల జాబితాను ప్రకటిస్తుంది. ఈసారి కూడా సింగపూర్ తన స్థానం పదిలంగా ఉంచుకుంది.
Most Expensive City Singapore
జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ కనీసం ఒక మిలియన్ డాలర్ బ్యాంకింగ్ ఆస్తులు కలిగి ఉన్న అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే దానిపై దృష్టి సారిస్తుంది. వారు ఎలా ఖర్చు చేస్తున్నారనే దానిపై ఫోకస్ పెడుతుంది. సదరు సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించింది. ఈ జాబితా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పును సూచిస్తుందని జూలియన్ బేర్ స్పష్టం చేసింది.
ఆర్థిక, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, కొనుగోళ్ల పరంగా సింగపూర్ టాప్ లో ఉండడానికి ప్రధాన కారణమని తెలిపింది సంస్థ. అదనంగా స్థానికులు ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారని పేర్కొంది. గత ఏడాది 2024లో ఇదే సంస్థ ప్రకటించిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్న హాంకాంగ్ ఉన్నట్టుండి మూడో ప్లేస్ లోకి పడి పోయింది. ఇదే స్థానంలో లండన్ నగరం చేరింది. ఇక జూలియస్ బేర్ లైఫ్ సంస్థ ప్రకటించిన విధంగా చూస్తే 10 నగరాలలో సింగపూర్ 1వ స్థానంలో ఉండగా , 2వ స్థానంలో లండన్, 3వ ప్లేస్ లో హాంకాంగ్, 4వ స్థానంలో షాంఘై, 5వ ప్లేస్ లో మొనాకో, 6వ స్థానంలో జ్యూరిచ్ , 7వ స్థానంలో న్యూయార్క్, 8వ స్థానంలో పారిస్ , 9వ ప్లేస్ లో సావో పాలో, 10వ స్థానంలో మిలన్ నగరాలు ఉన్నాయి.
Also Read : Parashar Lake Inspiring History : భీముడు నిర్మించిన ‘పరశుర సరస్సు’..అంతుచిక్కని ఎన్నో రహస్యాలు


















