Muralidhar Rao : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతికి దర్పణంగా నిలుస్తున్నాయి ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో పని చేసిన శ్రీధర్ ను అరెస్ట్ చేశారు. తను జైలులో ఉన్నాడు. తాజాగా మాజీ చీఫ్ ఇంజనీర్ గా పని చేసిన మురళీధర్ రావుపై (Muralidhar Rao) తీవ్ర ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగింది ఏసీబీ. పెద్ద ఎత్తున పలు చోట్ల దాడులు నిర్వహించింది. సోదాలు జరిపింది. భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు తేలింది. ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
Muralidhar Rao 200 Crores Illegal Assets
ఇదే క్రమంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో , బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరు పని చేశారనే దానిపై ఏసీబీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ మేరకు పెద్ద ఎత్తున జాబితాను సేకరించి దశల వారీగా దాడులకు శ్రీకారం చుట్టింది. మాజీ ఈఎన్సీ గా పని చేసిన హరీ రామ్ తో పాటు ఈఈ నూనె శ్రీధర్ లను అరెస్ట్ చేసిన విదితమే. ఇక తాజాగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ మురళీధర్ రావును లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది ఏసీబీ.
హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని తన నివాసంలో సోదాలు జరిపారు. తనను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో వెంటనే హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి తనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏక కాలంలో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్, తదితర ప్రాంతాలలో సోదాలు చేపట్టారు. మురళీధర్ రావు బంధువుల ఇళ్లలో కూడా దాడులు చేపట్టారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు వెలుగు చూశాయి. దాదాపు అక్రమ ఆస్తుల విలువ రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా.
Also Read : Walking Interesting Benefits : ప్రతిరోజూ వాకింగ్ ఇలా చేస్తే మీ నడుము నొప్పి మాయం
















