హైదరాబాద్ : విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రం ఆకాశంలో ఒక తార. నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ , మొదటి పాట ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రకటించిన విధంగానే విడుదల అవుతుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బహుభాషా విడుదల వ్యూహంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భారతీయ ప్రాంతాల్లోని ప్రేక్షకులను కూడా చేరుకోవాలని ఈ చిత్రం లక్ష్యంగా పెట్టుకుంది. మలయాళం, తెలుగు, తమిళం , హిందీ భాషా చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉన్న దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో నటించడం , పవన్ సాదినేని దర్శకత్వం వహించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటల ద్వారా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో విడుదల దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు సినీ ప్రేక్షకుల్లో ‘ఆకాశంలో ఒక తార’ ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ , సాత్విక వీరవల్లితో పాట ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్ ఒక ధైర్యవంతురాలైన సైన్స్ టీచర్‌గా కనిపించనున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచినప్పటికీ, ఆమె ఈ సినిమాలో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. మొదటి పాట విడుదలైన తర్వాత, అభిమానుల్లో మరింత కుతూహలాన్ని పెంచింది. చిత్రంలోని భావోద్వేగ కథనంలో సంగీతం కీలక పాత్ర పోషించ నుండటంతో ఈ సినిమా ప్రమోషన్లలో సౌండ్‌ట్రాక్ ఒక ముఖ్యమైన భాగంగా మారనుంది. ఇక ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ , స్వప్న సినిమాస్ , వైజయంతి మూవీస్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
















