హైదరాబాద్ : అంబర్పేట గల్లీ నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన మన హైదరాబాద్ కుర్రాడు ఉట్కూరి యశ్వీర్ గౌడ్ ఇప్పుడు సంచలనంగా మారాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ప్రస్తుతం తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి, అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ పై గెలిచాక గ్రౌండ్లో చూపించిన ఆ పౌరుషం, ఆ ఎమోషన్ ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఎక్కడ చూసినా యశ్వీర్ గౌడ్ పిక్చర్నే చూస్తూ వాళ్లు ఒకటే లబోదిబోమంటున్నారు. ఇది కొత్త తరం టీమిండియా ఆటిట్యూడ్. మన కుర్రాళ్ల ఈ అగ్రెసివ్ తీరు చూసి తట్టుకోలేక భారత ఆటగాళ్లు మరీ ఇంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారేంటి అంటూ పాకిస్థాన్ కామెంటేటర్లు, విశ్లేషకులు లైవ్లోనే ఏడుపు మొదలు పెట్టారు.
ఎందుకంటే మొన్న గ్రూప్ మ్యాచ్ గెలిచాక పాకిస్థాన్ ఆటగాడు హంజా జహూర్ జేబులోంచి ముందుగానే రాసుకున్న ఒక చిట్టీని తీసి “ఇండియాకు ఇది దీపావళి గిఫ్ట్” అంటూ విపరీతంగా ఓవర్ యాక్షన్ చేశాడు. అంతే కాకుండా ఫైనల్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు పాక్ ఆటగాళ్లు విపరీతంగా స్లెడ్జింగ్ చేస్తూ, మాటల దాడితో మన బ్యాటర్లను కవ్వించే ప్రయత్నం చేశారు. ఆ కవ్వింపులన్నింటికీ అసలైన టైమ్లో కప్ గెలిచి, మైదానంలోనే గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు మన యశ్వీర్ గౌడ్. పేపర్లు రాసుకుని బిల్డప్ ఇవ్వడం కాదు, విజయంతో సమాధానం చెప్పడమంటే ఇదే. దేశం గర్వపడేలా చేసిన ఈ యంగ్ టైగర్కు హ్యాట్సాఫ్.



















