నాగర్ కర్నూల్ జిల్లా : విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా, కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే పరిమితం కాకుండా సొంతంగా వ్యాపారాలను స్థాపించి, కనీసం పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తుమ్మర్ మల్లన్న ఆకాంక్షించారు. బీసీ రాజ్యాధికార యాత్ర’లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని జూపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషించిన మల్లన్న వారి చదువుల గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వయస్సు నుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు కష్టపడి పని చేయాలని విద్యార్థులకు సూచించారు.
ప్రతి విద్యావంతుడు కేవలం ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనకే పరిమితం కాకుండా, పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుండి, ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా, విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని మల్లన్న అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ సమాజంలో మార్పు తీసుకు రావాలని కోరారు. విద్య అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా, సామాజిక ప్రగతికి తోడ్పడేలా ఉండాలని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చేలా ఉండాలని తీన్మార్ మల్లన్న విద్యార్థులకు హితవు పలికారు.















