అమరావతి : రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు సత్తా చాటాలని, వంద శాతం ఫలితాలు సాధించాలని పిలుపునిచచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. డబులింజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పడాలి. ఇది నేతల పనితీరుకు కొలమానం కావాలన్నారు. మన ముందు ఉన్నవి కేవలం 50 రోజులు మాత్రమేనని , ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. గెలుపే ధ్యేయంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు సీఎం. గెలుపు, నిజాయితీ, సమర్థత, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించారు .సిన్సియార్టీ లేకుండా డ్రామాలాడే వారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అలాంటి వారిని ఊపేక్షించం అని వార్నింగ్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.
స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్ ఇస్తాం అన్నారు. సరిగా పని చేయాలని అందరిని కోరుతున్నానని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు..కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకం అని నొక్కి చెప్పారు. న్యూట్రల్స్ సానుభూతి పరులుగా… ప్రత్యర్థులు న్యూట్రల్సుగా మారేలా పార్టీ కేడర్ పని చేయాలని అన్నారు. ఈ ఎన్నికలతో గొడ్డలి పార్టీకి, అభివృద్ది నిరోధకులకు, రౌడీలకు, రప్పా రప్పా టీంలకు గట్టి బుద్ది చెప్పాలని ఆదేశించారు సీఎం . రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని, అంతే మొత్తంలో అభివృద్ది పనులు చేశాం అన్నారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. చెత్త పన్ను రద్దు చేశాం. చెత్తనూ తొలగించాం. చక్కటి రోడ్లు వేశాం. ఇరిగేషన్ కు పూర్వ వైభవం తెచ్చాం అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును పూర్తి చేశాం. వికేంద్రీకరణ విధానంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు సీఎం.


















