చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ దర్శకుడిగా పేరు పొందారు అట్లీ. తను ఏది చేసినా సెన్సేషనే. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీ తీసే పనిలో పడ్డాడు. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. తాజాగా తన నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. తమిళ చిత్రం కోసం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో మమరోసారి అట్లీ జతకట్టనున్నారు. ‘మైత్రీ మూవీ మేకర్స్’తో రూ. 300 కోట్ల ప్రాజెక్ట్ , సుకుమార్‌తో రూ. 1000 కోట్ల భారీ చిత్రం నిర్మాణ దశలో ఉండగా, షారుఖ్ ఖాన్ ఇప్పుడు దర్శకుడు అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. షారుఖ్ ఖాన్ తన బాక్సాఫీస్ పట్టును దక్షిణాదికి విస్తరిస్తున్నారు. దక్షిణాది మార్కెట్‌కు ప్రధానంగా సరిపోయే కథాంశంపై పనిచేయాలని తమిళ దర్శకుడు అట్లీని కోరినట్లు సమాచారం.
అట్లీ ప్రస్తుతం చేస్తున్న ‘రాకా’ చిత్రం పూర్తయిన వెంటనే వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తారు. బాలీవుడ్ , దక్షిణాది చలనచిత్ర పరిశ్రమల మధ్య అంతరాన్ని షారుక్ ఖాన్ వ్యూహాత్మకంగా తగ్గిస్తున్నారు. 2013లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ భారీ స్థానిక పంపిణీ వ్యూహంతో దక్షిణాది సాంస్కృతిక అంశాలను పరిచయం చేయగా, 2023లో వచ్చిన యాక్షన్ చిత్రం ‘జవాన్’ దక్షిణాది ప్రధాన మార్కెట్లోకి అధికారిక ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. ఆ విజయాలను కొనసాగిస్తూ ‘మైత్రీ మూవీ మేకర్స్’తో రూ. 300 కోట్ల ప్రాజెక్ట్ , ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ వంటివి ఆయన తాజా వ్యూహాత్మక అడుగుల్లో ఉన్నాయి. సుకుమార్ ప్రాజెక్ట్ సుమారు రూ. 800 నుండి రూ. 1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుందని, ఇది ఆర్ఆర్ఆర్ సినిమా నెలకొల్పిన భారీ స్థాయి రికార్డులను అధిగమిస్తుందని అంచనా.



















