హైదరాబాద్ : హైదరాబాద్ లో ఎపిక్ మూవీ ట్రైలర్ ఘనంగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హాజరయ్యారు. తనను మనసారా వదినా అని పలిచారు తనను ఆనంద్ దేవరకొండ. తను విజయ్ దేవరకొండకు సోదరుడు. ఇదిలా ఉండగా ఈ ఎపిక్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించారు. ఈ సినిమా ట్రైలర్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు నేషనల్ క్రష్ మందన్నా. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ రష్మిక గురించి ఆప్యాయంగా మాట్లాడారు. తన ‘బేబీ’ సినిమా ప్రమోషన్ల సమయంలో అభిమానులు ఆమెను “వదినా” అని పిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో “వదినా” అనే వ్యాఖ్యలకు తాను స్పందించ లేక పోయానని న్నారు. కానీ ఇప్పుడు గర్వంగా రష్మికను తన “వదినా” అని పిలుచు కోగలనని ఆనంద్ అన్నారు. తనను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ మద్దతు ఇస్తున్నందుకు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. తన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత రష్మిక ఇటీవల తనకు మెసేజ్ చేసిందని ఆ నటుడు వెల్లడించారు.
ఆమె తన నటనను మెచ్చు కోవడంతో పాటు, ఒత్తిడికి గురవుతున్నారా అని అడిగి, తన ఆందోళనను, మద్దతును తెలియ జేసిందని తెలిపాడు. విజయ్ దేవరకొండ లాంటి అండగా నిలిచే సోదరుడు, రష్మిక లాంటి శ్రద్ధగల ‘వదిన’ ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనంద్ అన్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ‘ఎపిక్’ ఒక భావోద్వేగ భరితమైన రొమాంటిక్ కామెడీ అని వర్ణించారు. ఈ టైటిల్‌కు పెద్ద కథ అనే అర్థం లేదని ఆనంద్ వివరించారు. బదులుగా ఈ చిత్రం సంబంధాలలో ఉండే చిన్న, అందమైన క్షణాలపై దృష్టి పెడుతుందని, అవి జీవితంలో చిరస్మరణీయమైన క్షణాలుగా నిలిచి పోతాయ.న్నాడు. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య నటనను, ఆమె రూపాంతరాన్ని కూడా ఆనంద్ ప్రశంసించారు. కాగా ‘ఎపిక్’ సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇది సంబంధాలు, భావోద్వేగాలు , కుటుంబ బంధాలను కూడా అన్వేషించే ఒక ఆహ్లాదకరమైన ప్రేమకథ అని ఆనంద్ వర్ణించారు.



















