న్యూఢిల్లీ : నిన్నటి దాకా జెన్ జెడ్ యువతను అమ్మనా బూతులు తిట్టిన భారతీయ జనతా పార్టీకి చెందని ఎంపీ, ప్రముఖ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఉన్నట్టుండి దెబ్బకు దిగి వచ్చింది. సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ కు గురైంది. మొన్న తీవ్ర విమర్శలు గుప్పించిన కంగనా ఉన్నట్టుండి తన స్వరం మార్చుకుంది. ఎవరూ ఊహించని విధంగా జెన్ జెడ్ యువత కు కితాబు ఇచ్చింది. జెన్ జెడ్ మన దేశానికి బలం , గర్వకారణం అని పేర్కొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ మన యువత మన సంస్కృతి, దాని గుర్తింపునకు రాయబారులుగా ఎదుగుతుండటం చాలా సంతోషకరమని అన్నారు. అంతకు ముందు ఆమె జెన్ జెడ్ నిరసనకారులను జనరేషణ్ గట్టర్ ( మురికి తరం) అని మండిపడింది. కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదాన్ని సృష్టించాయి.
దీంతో నటి దిగి వచ్చేలా చేశారు జెన్ జెడ్ యువత. కొద్ది రోజులకే నటి-రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ వారిని భారతదేశపు అతిపెద్ద బలం అని ప్రశంసించారు. జెన్ జెడ్ యువత సమస్యలను వినాలని, వారు దేశ వ్యతిరేకులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రనౌత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జెన్ జెడ్ మన దేశానికి బలం . ఒక విధంగా మన దేశానికి గొప్ప ఆస్తి. మన యువత మన సంస్కృతి , దాని గుర్తింపుకు రాయబారులుగా ఎదుగుతుండటం మాకు చాలా సంతోషాన్నిస్తోంది అని ఆమె పార్లమెంటు వెలుపల విలేకరులతో అన్నారు. రాష్ట్ర నియామక పరీక్షలలో అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలవడానికి రాంచీకి వెళ్లనందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కూడా ఆమె విమర్శించారు.
















