చెన్నై : హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన సీఎం విజయ్ నటించిన కీలక మూవీ జన నాయగన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంలో నటుడితో పాటు నటించిన నటీమణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించి ముఖ్యమైన సన్నివేశాలను తొలగించడాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. జన నాయగన్’ సినిమాకు సంబంధించిన భావోద్వేగపూరితమైన BTS (తెర వెనుక) ఫోటోలను పూజా హెగ్డే పంచుకున్నారు. విజయ్ , పూజా హెగ్డేలతో పాటు ఈ చిత్రంలో బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి , ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. సినిమా విడుదల రోజున భావోద్వేగానికి లోనైన ఆమె, ఇన్స్టాగ్రామ్లో కొన్ని అరుదైన ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్, వి. సెల్వకుమార్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 9న పొంగల్ పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందన్న కారణంతో CBFC (సెన్సార్ బోర్డు) దీనికి సర్టిఫికేషన్ ఇవ్వడంలో జాప్యం చేయడంతో సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడింది. విజయ్ ‘జన నాయగన్’లో తన సన్నివేశాలు తొలగించబడటంతో కోలీవుడ్ నటి ఆనంది అజయ్ వాపోయింది. తన సన్నివేశాలు లేవని తెలిసినప్పుడు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.



















