హైదరాబాద్ : ఎమిరేట్స్ దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎ380 ఉపాధ్యక్షుడు (ఇండియా, నేపాల్ ) మహమ్మద్ సర్హాన్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం తమ విమానయాన సంస్థ తన కార్యకలాపాలకు 25 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. హైదరాబాద్ నుండి ఎయిర్‌బస్ A380 సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలించడానికి ఎమిరేట్స్ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు ఈ సందర్భంగా సీఎం రరేవంత్ రెడ్డి.
A380 సర్వీసులను ప్రవేశపెట్టి విమాన కార్యకలాపాలను పెంచడం ద్వారా హైదరాబాద్‌లో తమ ఉనికిని విస్తరించాలని ముఖ్యమంత్రి ఎమిరేట్స్‌ను కోరారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని ఆయన ప్రదర్శించారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో రాబోయే విమానాశ్రయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో తమ నిర్వహణ, మరమ్మత్తు , ఓవర్‌హాల్ కార్యకలాపాలను స్థాపించి, విస్తరించాలని విమానయాన సంస్థను ఆహ్వానించారు. పూర్తి ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
విమానయాన రంగానికి అతీతంగా, గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో అథ్లెట్ల శిక్షణా కార్యక్రమాలను స్పాన్సర్ చేయడం ద్వారా తెలంగాణ క్రీడా ప్రస్థానంలో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి ఎమిరేట్స్‌ను ఆహ్వానించారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫర్హాన్. హైదరాబాద్ నుండి ఏ380 విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశాలను అన్వేషించడానికి ఎమిరేట్స్ సుముఖత వ్యక్తం చేయడంతో పాటు, స్పాన్సర్షిప్ కార్యక్రమాల ద్వారా క్రీడాభివృద్ధికి మద్దతు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
















