న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది కేరళ వాసులకు. ప్రతి ఏటా ఓనం పండుగ ఘనంగా నిర్వహిస్తారు ఆ రాష్ట్రంలో. తాజాగా ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ప్రత్యేకంగా 100 రైళ్లను నడుపుతామని వెల్లడించారు. అయితే ప్రత్యేక రైళ్ల వివరాలు (వేళలు, మార్గాలు, ఆగే స్టేషన్లు) త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో సోమవారం నాందేడ్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించే ముందు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. ఓనం పండుగ సందర్భంగా కేరళకు అదనంగా రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పండుగ సీజన్‌లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు సేవలను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.
ఆగస్టులో జరగనున్న ఓనం పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే కేరళ ప్రజలకు ఈ ప్రకటన ఉపశమనం కలిగించనుంది. పండుగ సీజన్‌లో నెలల ముందే రైలు టిక్కెట్లు పూర్తిగా అమ్ముడై పోవడం వల్ల ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతుంటాయి. నాందేడ్-ముంబై , తనక్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంత్రి వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తనక్‌పూర్-పిలిభిత్ రైలు సేవను షాజహాన్‌పూర్ వరకు పొడిగించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పూరీలో జరగనున్న జగన్నాథుని రథయాత్ర కోసం రైల్వే ఏర్పాట్లను సమీక్షించడానికి అక్కడే ఉన్నారు,


















