ముంబై : బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మహిళా క్రికెటర్ల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. సంస్థను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి నిర్ణయం ఎందరికో మేలు చేకూరేలా చేస్తుందన్నారు. తాజాగా తను మీడియాతో మాట్లాడారు. ఐసీసీ ప్రసూతి తర్వాత వచ్చే క్రికెటర్లకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది ఎంతో బాగుందంటూ పేర్కొంది నటి. ఈ చొరవకు సంబంధించిన ఒక నివేదికన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. ఈ చర్యను ప్రశంసించారు. క్రీడలలో మహిళలకు ఇది ఒక మైలురాయి అని ఆమె రాశారు. మహిళా క్రికెటర్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్తగా ప్రకటించిన ప్రసూతి పునరాగమన మార్గదర్శకాలను స్వాగతించారు.
ఐసీసీ మహిళా క్రికెటర్ల కోసం ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్’ను ప్రారంభించింది. ఇది క్రీడాకారులు, సభ్య బోర్డులు, వైద్య నిపుణులు , కోచ్‌లకు గర్భధారణ తర్వాత క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మద్దతు ఇవ్వడానికి ఒక ఆచరణాత్మక చట్రాన్ని అందిస్తుంది. మహిళల క్రికెట్ మరింత వృత్తిపరంగా మారుతుండటంతో , కెరీర్ అవకాశాలు విస్తరిస్తూనే ఉండటంతో, ఎక్కువ మంది క్రీడాకారులు తమ ఆట జీవితంలోనే కుటుంబాలను ప్రారంభించి, ప్రసవం తర్వాత ఉన్నత స్థాయి క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ఎంచుకుంటున్నారు. ఈ ప్రక్రియకు సహాయ పడటానికి ఈ మార్గదర్శకాలు రూపొందించింది ఐసీసీ. మహిళా క్రికెటర్ల ఆరోగ్యం, సంక్షేమం అనేవి మహిళల క్రికెట్ పట్ల ఐసీసీ విధానంలో ప్రధాన స్తంభాలుగా పేర్కొంది.



















