ముంబై : ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ సూలే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తో ఎన్సీపీకి విడదీయలేని బంధం ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు ఎంపీ. అయితే విలీనం చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టారు. ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశంలో తమ పార్టీతో ఇతర పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలంటూ సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రపోజల్ తీసుకు వచ్చారని వెల్లడించారు. దీనిపై ఇంకా తాము తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇదే సమయంలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకన్నారు.
1991లో జరిగిన నా వివాహానికి అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ , రాజీవ్ గాంధీ హాజరయ్యారు.
మార్చి 4న, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ని తనతో పాటు తీసుకెళ్లడానికి వచ్చారు…కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ చంద్రశేఖర్‌తో కలిసి ఆ విమానంలో వెళ్లలేదు. ఆయన వేరే విమానంలో వెళ్లారు. ఆ తర్వాత, బహుశా మార్చి 7 లేదా 10వ తేదీన, కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించు కోవడంతో కేంద్ర ప్రభుత్వం పడి పోయిందన్నారు. నా అత్తమామల తరఫు వారు రిసెప్షన్ ఏర్పాటు చేశారు, కానీ మా నాన్న అక్కడ లేరు; మా అమ్మ, మా మామయ్య ప్రతాప్ పవార్ , అత్త అతిథులకు స్వాగతం పలికారని చెప్పారు సుప్రియా సూలే.


















