హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏకి పారేశారు. సెక్రటేరియట్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ప్రధానంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి మెట్రో విస్తరణకు అడ్డుపుల్ల వేస్తున్నాడని ఆరపించారు. ఆయన వళ్ళే కేంద్రం.విడుదల చేయాల్సిన నిధులను నిలిపి వేసిందని మండిపడ్డారు .కేసీఆర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి ఆడుతున్నాడంటూ విమర్శించారు. మెట్రో పై ఎందుకు అంత అక్కసు చూపుతున్నారో తెలియట్లేదని, అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డు తగులుతుండడం దారుణమన్నారు సీఎం.
మెట్రో రెండవ దశ నిర్మాణానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ఖర్చులు తగ్గించు కోవడానికి మెట్రోలో ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు…
కిషన్ రెడ్డికి ఆ విషయం అర్థం కావడం లేదన్నారు. కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ పటేల్ తో పాటు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాం అన్నారు సీఎం. రాజకీయాలతో అభివృద్ధికి ముడి పెట్టవద్దని కోరారు. గత నెల 20 న కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ నిధులను అడ్డుకున్నది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. తన వల్లే నిధులు ఆగి పోయాయని ఫైర్ అయ్యారు.
మెట్రో విస్తరణకు అనుమతులు ఇస్తే, సకాలంలో నిధులు మంజూరు చేస్తే రేవంత్ రెడ్డి కి.పేరు వస్తుందని అన్నారని, ఆ విషయం తనకు తెలిసి పోయిందన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఉండాలా వద్దా..? అంటూ కేంద్ర మంత్రుల ముందు కిషన్ రెడ్డి హెచ్చరిక దోరణిలో ఒత్తిడి చేయడం వల్లే అనుమతులు నిధులు ఆగి పోయాయని వాపోయారు.















