హైదరాబాద్ : జోజిలా టన్నెల్ నిర్మాణం నిర్దేశిత సమయంలో పూర్తయింది. ఇది చరిత్రను సృష్టించింది.
ప్రధాన సొరంగం బాల్తాల్‌లోని పశ్చిమ ప్రవేశ ద్వారం నుంచి మీనామార్గ్‌లోని తూర్పు ప్రవేశ ద్వారం వరకు విస్తరించి ఉంది. సొరంగం తవ్వక పనులు రెండు వైపుల నుంచీ ఎం ఈ ఐ ఎల్ సమాంతరంగా చేపట్టింది. ప్రధాన సొరంగంలో తుది బ్రేక్‌థ్రూ సాధించడం ద్వారా అత్యంత కీలకమైన తవ్వక దశ విజయవంతంగా పూర్తయింది. హిమాలయాల సున్నితమైన భూగర్భ నిర్మాణం, కఠిన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో భూగర్భ పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన ఇంజినీరింగ్ ప్రతిభకు ఇది నిదర్శనం.
జోజిలా టన్నెల్ నిర్మాణంలో న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్ ఏ టి ఎం)ను ఎం ఈ ఐ ఎల్ వినియోగిస్తోంది. ఈ పద్ధతి వివిధ రకాల శిలా నిర్మాణాలు, భూగర్భంలోని అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే, నిరంతర పర్యవేక్షణ ఆధారిత సౌకర్యవంతమైన సాంకేతిక విధానం. ఈ సాంకేతికత ద్వారా దశలవారీ తవ్వకాలు, తక్షణ మద్దతు చర్యలు, భూగర్భ ప్రతిస్పందనపై నిరంతర అంచనా సాధ్యమవుతాయి. ఫలితంగా భారతదేశంలో అత్యంత క్లిష్టమైన పర్వత సొరంగ నిర్మాణ ప్రాంతాల్లో ఒకటైన జోజిలాలో స్థిరత్వం, భద్రత, నిర్మాణ పురోగతి విజయవంతంగా కొనసాగాయి. ప్రధాన సొరంగంతో పాటు ఈ ప్రాజెక్టులో భాగంగా అప్రోచ్ రోడ్లు,వంతెనలు రక్షణ నిర్మాణాలు,కట్-అండ్-కవర్ సెక్షన్లు , మంచు రక్షణ గ్యాలరీలు, ఇతర సొరంగ అనుబంధ నిర్మాణాలు కూడా ఎం ఈ ఐ ఎల్ నిర్మిస్తోంది.


















