బెంగళూరు : కర్ణాటకలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఏఐసీసీ హైకమాండ్ ఆదేశించడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గవర్నర్ లేక పోవడంతో గవర్నర్ కార్యాలయ కార్యదర్శికి స్వయంగా సిద్దరామయ్య తన అనుచర గణంతో కలిసి ఇచ్చింది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు సిద్దరామయ్య. తనకు పార్టీ పరంగా కీలకమైన రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిని తాను తిరస్కరించినట్లు వెల్లడించారు .
ఇక నుంచి రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు సిద్దరామయ్య..ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తా అంటూ ప్రకటించారు. అయితే తాను అసంతృప్తిలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇదంతా పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీని కష్టపడి అధికారంలోకి తీసుకు వచ్చిన తమ నేతకు అన్యాయం చేశారని సిద్దు వర్గం నాయకులు ఆందోళన చెందుతున్నారు. డీకేఎస్ వ్యవహరించే దాన్ని బట్టి తమ సహకారం ఆధారపడి ఉంటుందని కామెంట్స్ చేయడం కలకలం రేపింది. మొత్తంగా ఇంకా డీకెఎస్ పదవి చేపట్టక ముందే మొదలైన అలజడి నెలకొంది. సిద్ధరామయ్య రాజ్యసభ సీటు నిరాకరించడంతో అధిష్టానంలో ఆందోళన మొదలైంది.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊహించని ఆఫర్ ఇచ్చింది ఏఐసీసీ. ఈ మేరకు సిద్దరామయ్యను తప్పించింది. ఆయన స్థానంలో డీకేఎస్ కు ఛాన్స్ ఇస్తూ సంచలన ప్రకటన చేసింది. దీంతో సిద్దూ అనుచరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

















