చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నమెంట్ లో చెన్నై వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో ఆసక్తికర పరిణామాలు , ఉద్రిక్త సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నడు. తన డెసిషన్ రాంగ్ అని తేలి పోయింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించింది. అయినా సీఎస్కే ప్లేయర్లు ఎక్కడా తగ్గలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 181 రన్స్ చేసింది. ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ పాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రధాన వికెట్లను కూల్చాడు. దీంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది. బౌలింగ్ పిచ్ పై ఆ మాత్రం స్కోర్ చేయడం మామూలు విషయం కాదు. ఒకానొక దశలో సీఎస్కే గెలుస్తుందని అంతా భావించారు. కానీ అడ్డుగోడలా నిలబడ్డారు హెన్రిచ్ క్లాసెన్ , ఇషాన్ కిషన్. ఈ ఇద్దరూ కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ సందర్బంగా క్లాసెన్ ఆడుతున్న సమయంలో పరుగులు తీసేందుకు ముందుకు వచ్చాడు. కను రెప్ప పాటులోనే వికెట్ కీపర్ గా ఉన్న సంజు శాంసన్ అనూహ్యంగా స్టింపింగ్ చేశాడు. అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ ఎస్ ఆర్ హెచ్ ఒప్పుకోలేదు. చివరకు మూడో అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో క్లాసెన్ శాంసన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నై ప్లేయర్లు ఒక చోటుకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో మ్యాచ్ అంపైర్ హుటా హుటిన ఈ ఇద్దరి వద్దకు వచ్చాడు. ఇద్దరినీ సముదాయించడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇదిలా ఉండగా కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ చాలా కూల్ గా ఉంటాడు. తనపై క్లాసెన్ నోరు పారేసు కోవడం పట్ల ఫ్యాన్స్ మండి పడుతున్నారు.



















