ముంబై : ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సంచలనంగా మారారు. ఆయన వార్షిక వేతనం తీసుకునే సీఈఓలలో ముందు వరుసలో ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ పారితోషకంగా రూ. 28 కోట్లు అందుకుంటున్నట్లు తెలిపింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పారితోషికంగా రూ. 28 కోట్లు అందుకున్నారు; ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3% అధికం. టాటా గ్రూప్ , TCS ఛైర్మన్ N. చంద్రశేఖరన్ ఎటువంటి కమీషన్ తీసుకోకుండా, కేవలం ‘సిట్టింగ్ ఫీజు’ల రూపంలో రూ. 4.2 లక్షలు మాత్రమే స్వీకరించారు.
ఒక విధానపరమైన నిర్ణయంగా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కంపెనీ నుండి కమీషన్ స్వీకరించకుండా దూరంగా ఉన్నారని టీసీఎస్ వెల్లడించింది. కాబట్టి ఆ వివరాలు ఇక్కడ పేర్కొనబడలేదు అని వార్షిక నివేదిక తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కృతివాసన్ పారితోషిక ప్యాకేజీలో రూ. 1.67 కోట్ల మూల వేతనం , రూ. 1.43 కోట్ల మేర ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, రూ. 25 కోట్ల పనితీరు ఆధారిత కమీషన్ ఉన్నాయి. ఈ ప్రముఖ IT సంస్థ యొక్క 2025-26 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదిక ప్రకారం, CEO పారితోషికం అనేది TCS ఉద్యోగుల ‘మధ్యస్థ పారితోషికం కంటే 332.8 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ పారితోషికం 5.1 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.



















