చెన్నై : ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్ లలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ఆట తీరుతో ఓటమి పాలైంది. ఈ మూడు మ్యాచ్ లలో రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన కేరళ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఆశించిన మేర ఆడలేక పోయాడు. దీంతో ప్రతి ఒక్క ఎందుకు ఇంత ధర పెట్టి కొన్నారంటూ ట్రోల్స్ చేశారు. కానీ ఆ తర్వాత టోర్నీలో తొలి సెంచరీ చేశాడు. ఆ తర్వాత మరో సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో 87 రన్స్ చేసి దుమ్ము రేపాడు. ఇలా తను ఆడిన ప్రతీ మ్యాచ్ సీఎస్కే అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో ఉన్న సీఎస్కే ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో చేరేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్బంగా స్టార్ క్రికెటర్ శాంసన్ మీడియాతో మాట్లాడాడు. ఈ టోర్నమెంట్‌లో మా ఆరంభం అంత గొప్పగా ఏమీ లేదు, కానీ మేము పుంజుకున్న తీరు, అలాగే ప్రతి ఒక్క ఆటగాడు పెట్టిన కృషి నిజంగా అద్భుతం. అయితే, మా అర్హత అవకాశాలు ఇప్పటికీ మా చేతుల్లోనే ఉన్నాయి. మాకు మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తే, మేము అత్యంత సులభంగా అగ్రస్థానంలో నిలిచి అర్హత సాధిస్తామన్నాడు. మేము అలా చేయగలమని, మా అభిమానులను సంతోష పెట్టగలమని నేను ఆశాభావంతో ఉన్నానని చెప్పాడు సంజు శాంసన్.



















