Telangana Govt : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. బోనాల పండుగ సందర్బంగా మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. రంగు రంగుల బోనాలను పురస్కరించుకుని, ప్రభుత్వం జూలై 12 నుండి 14 వరకు సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలలకు వరుసగా మూడు రోజుల సెలవు ప్రకటించింది. రెండవ శనివారం ప్రారంభమైన ఈ పండుగను ఆదివారం, సోమవారం కూడా జరుపుకుంటారు. దీని వల్ల విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్ కు ఫుల్ ఎంజాయ్ చేసేందుకు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.
Telangana Govt Gives 3 days Holidays to Schools
బోనాలు పండుగ తెలంగాణ (Telangana) ప్రాంతంలోని ప్రధాన వేడుక. దీనిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసం మూడవ ఆదివారం సికింద్రాబాద్ లష్కర్ బోనాలుతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. భక్తులు అత్యంత భక్తితో అమ్మ వారికి బోనాలు అర్పించారు. చాలా చోట్ల అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు.
సికింద్రాబాద్ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సోమవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే అమ్మ వారి ఊరేగింపు, వేడుకలు కూడా ఉన్నాయి. వారాంతపు సెలవులతో పాటు, ఈ ప్రాంతంలోని విద్యార్థులు, కళాశాల విద్యార్థులకు మూడు రోజుల విరామం లభించింది. రేపు రెండవ శనివారం కావడంతో సెలవు ప్రకటించింది. ఆదివారం ఇప్పటికే సెలవు ఉండడంతో సోమవారం కూడా బోనాల సందర్బంగా సెలవు ఇస్తున్నట్లు తెలిపింది.
Allso Read : Ex MP Keshava Rao Fired on BRS : బీసీల రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు అవగాహన లేదు

















