ఢిల్లీ : ఐపీఎల్ 19వ సీజన్ లో ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో స్వంత గడ్డపై మరోసారి ఓటమి పాలైంది అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్. అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు బాట పట్టింది. ఆ జట్టుకు ఇది నాలుగో విజయం కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా ఏడో ఓటమి. ఈ మెగా టోర్నీలో వరుస ఓటములతో కుంగి పోయాయి రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో నైట్‌రైడర్స్.. 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలోనే పని పూర్తి ఏసింది. ప్రత్యేకించి చెప్పాల్సింది ఆజట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ అలెన్. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరేలా ఆడాడు. మైదానం నలు వైపులా ఫోర్లు , సిక్సర్లతో రెచ్చి పోయాడు. తన దెబ్బకు బౌలర్లు బెంబేలెత్తి పోయారు. తను కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొని 100 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు 10 సిక్సులు ఉన్నాయి.



















