హైదరాబాద్ : ఐపీఎల్ 19 మెగా టోర్నీలో ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ తగిలింది. అనూహ్యంగా కావ్య మారన్ యాజమాన్య నేతృత్వంలో పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి సూపర్ షో చేసింది. ఓ వైపు ఉప్పల్ వేదికగా స్వంత గడ్డపై ఓటమి పాలైంది కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో. దీంతో దెబ్బతిన్న పులిలా విరుచుకు పడింది ఆ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో అద్భుతమైన ఫామ్ తో ఆకట్టుకున్నాడు కూపర్ కొలిన్స్ . తను ఏకంగా సెంచరీ బాదాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. అయినా తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ కాలేక పోయాడు.
ఇదిలా ఉండగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు చెలరేగి పోయారు. హెన్రిచ్ క్లాసెన్ 43 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్సులతో 69 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది. అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 7 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. కూపర్ కనోలి 59 బంతులు ఎదుర్కొని సూపర్ సెంచరీ చేశాడు. తను 107 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి.


















