హైదరాబాద్ : మెగా ఫ్యామిలీకి చెందిన నటి, నిర్మాత నిహారిక కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా మరో సినిమా రాకాస పేరుతో నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. చిత్రం ప్రచార కార్యక్రమాన్ని తన భుజన వేసుకున్నారు నిహారిక కొణిదల. అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు. కొత్త వాళ్లతో తీయాలనేది తనకు ఇష్టమని ఈ సందర్బంగా చెప్పారు. ఇదే సమయంలో తన గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం తగదని, మంచి పద్దతి కాదని పేర్కొన్నారు నటి, నిర్మాత.
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతమైన జీవితం ఉంటుందని చెప్పారు. అలాగని వారి ఇళ్లల్లోకి వెళ్లి లేని పోనివి కల్పితాలు సృష్టిస్తూ , ఆపై ట్రోల్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించింది. తమకు కూడా స్వేచ్ఛ ఉంటుందని, అంతకు మించిన జీవితం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని పేర్కొంది నిహారిక కొణిదల. కాగా పరస్పర విరుద్ధమైన సోషల్ మీడియా విమర్శలకు తను ధీటుగా సమాధానం ఇచ్చారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తన రాబోయే చిత్రం ‘రాకస’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రీ వేడుకలో తన ప్రయాణంలో తను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.



















