అమరావతి : ఆంధ్ర్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ, అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షించడంలో ముందజంలో కొనసాగుతోంది. అపారమైన అనుభవం ఉన్న నాయకత్వం పాలనకు ఓ అస్సెట్ ఆ మారింది. ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ కు కూటమి సర్కార్ ధన్యవాదాలు తెలిపింది. హై స్కేల్ ఇన్వెస్ట్‌మెంట్లు కేవలం ఆర్థికపరమైన నిర్ణయాలు కావు, విశ్వసనీయత, నమ్మకంతో కూడుకున్నవి. తమకు మద్దతుగా ఏఎంఎన్ఎస్ ఇండియా సీఈవో దిలీప్ ఒమన్ కి కూడా కృతజ్ఞతలు తెలిపింది సర్కార్.
గూగుల్ డేటా సెంటర్ తో పాటు ప్రధాన కంపెనీలన్నీ ఇప్పుడు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ తరుణంలో భారీ పెట్టుబడులు పెట్టింది లక్ష్మీ మిట్టల్ కంపెనీ. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనితకి కూడా ధన్యవాదాలు. గట్టిగా నిలబడ్డారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించి అండగా నిలబడతాను, మా ప్రాంతానికి ఒక్క స్టీల్ ప్లాంట్ తీసుకు రావాలని నా వెనుక ఉండి నడిపించారు. ఈ భూమి పూజ స్థలంలో నిలబడి మేము ఒకటి నిరూపిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎంవోయూలపై సంతకాలు చేయడమే కాదు, వాటిని విజయవంతంగా గ్రౌండ్ చేస్తాం. ప్రాజెక్టులు ప్రకటించడం మాత్రమే కాదు, నిర్మిస్తాం. పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, ఫలితాలు సాధిస్తాం అని ప్రకటించారు నారా లోకేష్.















