Gold : బంగారం ధరలు రోజురోజుకు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే గురువారం బంగారం (Gold) ధరలు స్వల్పంగా తగ్గుదలను చూపించాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,170గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,990 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలోకు రూ.1,09,900 వద్ద ఉంది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్:
24 క్యారెట్ల – ₹98,170
22 క్యారెట్ల – ₹89,990
దిల్లీ:
24 క్యారెట్ల – ₹98,320
22 క్యారెట్ల – ₹90,140
ముంబై:
24 క్యారెట్ల – ₹98,170
22 క్యారెట్ల – ₹89,990
బెంగళూరు:
24 క్యారెట్ల – ₹98,170
22 క్యారెట్ల – ₹89,990
ధరలపై ప్రభావం చూపుతున్న అంశాలు:
బంగారం ధరలు డాలర్లలో వర్తకం చేయబడతాయి. డాలర్ బలపడితే ఇతర కరెన్సీలతో పోలిస్తే బంగారం ఖరీదైనదిగా మారుతుంది, దీని వలన డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు, ట్రంప్ వ్యాఖ్యలు, భారత మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
భవిష్యత్ అంచనాలు:
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ, ఇది తాత్కాలికమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రోజుల్లో బంగారం ధరలు ₹99,000 నుండి ₹1,00,000 మధ్య స్థిరపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరికొంత మంది నిపుణుల ప్రకారం ఇది ₹95,000 నుండి ₹1,00,000 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.
పెట్టుబడిదారులకు సూచన:
పసిడి లాంటి సురక్షిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ మార్పులను బట్టి ధరలు ఎప్పటికప్పుడు మారుతుండడంతో కొనుగోలు ముందు తాజా ధరలపై స్పష్టత పొందడం మంచిది. ఒక్క రోజులోనే ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి.
గమనిక: పై ధరలు మార్కెట్‌ను బట్టి మారవచ్చు. బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో తాజా ధరలను తెలుసుకోవాలి.
Also Read : Today Gold and Silver Price : పసిడి ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చిన ధరలు



















