హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ స్థానం కోసం నామినేషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశాడు. తన మనసులోని మాటలను బయటకు చెప్పడం ఆసక్తిని కలిగించింది. సోషల్ మీడియాలో రేవంత్ తో నా ఫ్రెండ్షిప్ గురించి ఏమి వస్తున్నాయో నాకు తెలిదన్నాడు. కానీ మేం ఇద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని పేర్కొన్నాడు. మా మధ్య ఉన్న స్నేహం బలమైనదని చెప్పాడు. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ నా వంతు కృషి చేశానని అన్నాడు.
పార్టీ కార్యకర్తగా గెలుపు కోసం పని చేసినట్లు తెలిపాడు. ఇక నుంచి కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు వేం నరేందర్ రెడ్డి. నేను కాంట్రవర్సీ కి దూరంగా ఉంటానని చెప్పాడు. ఇన్నేళ్లు నా రాజకీయా ప్రస్థానంలో ఎక్కడ కాంట్రవర్సీ కామెంట్స్ చెయ్యలేను చెయ్యను కూడా అని పేర్కొన్నాడు. నా గురించి అనే వాళ్ళు సవాలక్ష అంటారు అన్నింటికీ రెస్పాన్డ్ కానని తెలిపాడు. దయచేసి నాతో మాట్లాడించాలనే ప్రయత్నాలు చెయ్యకండి అని కోరాడు. K సముద్రం నియోజకవర్గ విషయంలో డి లిమిటేషన్ తర్వాత చాలా మార్పులు ఉంటాయని బాంబు పేల్చాడు వేం నరేందర్ రెడ్డి.

















