అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా భారీ స్కోర్ నమోదు చేసింది. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ మరోసారి సత్తా చాటాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేశాడు. తను విండీస్ తో 97 రన్స్ చేయగా, సెమీ ఫైనల్ లో 89 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. తాజాగా కీలకమైన ఫైనల్ పోరులో సైతం దుమ్ము రేపాడు. ఈసారి కూడా 46 బంతులు ఎదుర్కొని 89 రన్స్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. వరల్డ్ కప్ టోర్నీ ఫార్మాట్ లో సంజు సామ్సన్ వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌లలో, సెమీఫైనల్ , ఫైనల్‌లో యాభై పరుగులు చేశాడు. గతంలో విరాట్ కోహ్లీ , షాహిద్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను సాధించారు.
ఇక అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తను కూడా హాఫ్ సెంచరీతో విరుచుకు పడ్డాడు. 52 పరుగులు చేశాక మైదానంలోకి వచ్చిన ఇషాన్ కిషాన్ చుక్కలు చూపించాడు కీవీస్ బౌలర్లకు. తను కూడా హాఫ్ సెంచరీతో దంచి కొట్టాడు. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు పడినా ఎక్కడా భారత బ్యాటర్లు వెనక్కి తగ్గలేదు. చివరలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే బిగ్ షాక్ ఇచ్చాడు. తను కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ లో ఉతికి ఆరేశాడు.
















