అమరావతి : ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నామని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి విన్నపాలను స్వయంగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను స్వయంగా వివరించారు మంత్రికి. వాటి పరిష్కారం కోసం వెంటనే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు అచ్చెన్నాయుడు.
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం జ రిగేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి ఇబ్బందులు తెలుసుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. అధికారులు కూడా ప్రజల సమస్యల పరిష్కారంలో పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడైనా, ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శించినా లేదా ప్రజలు, బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం అందినా తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిస్సంకోచంగా ప్రభుత్వ దృష్టికి తీసుకు రావచ్చని పేర్కొన్నారు, మీ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు.

















