అమరావతి : 2025-26 సంవత్సరానికి రూ.22 కోట్లు కేటాయించగా, 214 మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.14.98 కోట్ల పరిహారం చెల్లించేందుకు బిల్లులు సమర్పించామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. వీరిలో 96 మంది గత ప్రభుత్వం కాలానికి చెందినవారేనని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా కూడా 2024-25 మరియు 2025లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారికి రూ.50 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందించామని వెల్లడించారు. 2023 ఖరీఫ్ కరువు మరియు డిసెంబర్ 2023లో సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా పెండింగ్‌లో ఉన్న 1.21 లక్షల రైతుల రూ.147.34 కోట్ల పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరంలో సరాసరి RSKల ద్వారా 255 కోట్ల విలువ చేసే యూరియా అమ్మకాలు జరపగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25 సంవత్సరంలో RSKల ద్వారా 292కోట్ల విలువ చేసే యూరియాను రైతులకు సరఫరా చేసామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రస్తుతం 2025-26లో RSKల ద్వారా 70% యూరియాని పంపిణీ చేయటం వలన, RSKల ద్వారా పంపిణీ మరింత పెరుగుతుందన్నారు. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026–27లో రూ.15.67 కోట్లు కేటాయించామని ప్రకటించారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.
















