నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత సర్కార్ తన దివంగత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. దీనిపై ఆయన స్పందించారు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి ప్రభుత్వ తీరు అంటూ ఆరోపించారు. తిరుమల పవిత్రతపై YCP చేసిన పాపాన్ని, మహానేత YSR కు చుట్టడం చంద్రబాబు కు భావ్యం కాదన్నారు. YCP కల్తీ పనులు నాటి YSR నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదని అన్నారు.
అసెంబ్లీ వేదికగా తన తండ్రి గురించి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు షర్మిలా రెడ్డి.
దివంగత ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. వైఎస్ఆర్ ఏడు కొండలను రెండు కొండలను చేయాలని ఏనాడూ అనుకోలేదని అన్నారు షర్మిలా రెడ్డి. జరిగిందంతా తప్పుడు ప్రచారమే తప్పా మరోటి కాదన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా బురద చల్లాలని చూసిందే మీరంటూ మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు తన తండ్రి అని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు అమలు చేశారని గుర్తు చేశారు. జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారని గుర్తు చేశారు.















