న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులను కలిశారు. తాజాగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. వానాకాలం పంట (2025 – 26) కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్ సీ ఐ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సీఎం .2024 – 25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుమతించాలని విన్నవించారు .
2024 – 25 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ బియ్యానికి గడువు మరో రెండు నెలలు పొడిగించాలని సూచించారు. FCI కు తెలంగాణ రాష్ట్రం 2014 – 15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి ఉన్న రూ. 1468.94 కోట్లను వెంటనే విడుదల చేయించాలని కోరారు రేవంత్ రెడ్డి. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుండి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను వెంటనే విడుదల చేయించాలన్నారు.

















